
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూటికంటి నరేశ్ గౌడ్ నేతృత్వంలో 203 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, పాలకుర్తి సర్పంచ్ యాకాంతరావు ఆధ్వర్యంలో, కోడకండ్ల మండలం, పాఖాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుగల్ల యాకయ్య, కొంగరి శ్రీను, అలాగే ఏడునూతల గ్రామానికీ చెందిన కాంగ్రెస్ నాయకులు 10 మంది, పెద్ద వంగర మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 203 మంది నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి BRS పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.