Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

ఒక్క నెల నాకోసం పనిచేయండి 59 నెలలు మీకు సేవ చేస్తా: నన్నపునేని నరేందర్

నేను పక్కా లోకల్…
కాంగ్రెస్ బిజెపికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి…

అంబేద్కర్ గారికి గౌరవమియాలన్నా సోయిలేదు కాంగ్రెస్ అభ్యర్థికి

తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చిత్తుచిత్తుగా అడ్రస్ లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయిందని
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు
నియోజకవర్గంలోని 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో వస్కుల బాబు ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వాస్కుల వినయ్,జన్ను సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ నుండి వస్కుల అజయ్,జన్ను శ్రవణ్,బుష్పాక రంజిత్ తో సుమారు 68 మంది యువకులు ఎమ్మెల్యే నపునేని నరేందర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

రాజ్యాంగ నిర్మాత దళితుల ఆరాధ్య దైవం సబ్బండ వర్గాల స్ఫూర్తి అంబేద్కర్ దగ్గరికి గౌరవంగా పోవాలని సోయి కూడా లేదు ఈ కాంగ్రెస్ అభ్యర్ధికి ఇక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డి కాలనీలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి చెప్పులేసుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వెయ్యబోతుంటే స్థానికులు ఆపి బుద్ధి చెప్తే మళ్ళీ కిందకు దిగి చెప్పులు విడిచి వెళ్లిన దుస్థితి కాంగ్రెస్ నాయకులది
ప్రజలకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చినప్పుడే ప్రజానాయకుడిగా ప్రజల్లో ఉంటాము లేబర్ కాలనీ అని పిలవబడే ఈ ప్రాంతానికి సమీపంలో నూతన కలెక్టరేట్ ఏర్పాటు చేసి ఇది లేబర్ కాలనీ కాదు ధనవంతులు కాలనీగా మారే విధంగా కృషి చేశా
ఈ ప్రాంతం కెసిఆర్ నాయకత్వంలో రోజురోజుకు గొప్పగా అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గంలో జిల్లా కేంద్రం,నూతన కలెక్టరేట్, నూతన బస్టాండ్,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,ప్రధాన రహదారులతో పాటు అంతర్గత సిసి రోడ్లు,ఇన్నర్ రింగ్ రోడ్,7 గురుకుల పాఠశాలలు,24 అంతస్తుల హాస్పిటల్,మెగా టెక్స్టైల్ ఇలా కనివిని ఎరగని రీతిలో వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది
భారతీయ జనతా పార్టీతో ఈ తెలంగాణకు మన నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదు పాస్టర్లను హింసించిన చరిత్ర బిజెపిది ఆ బీజేపీ దాడిని ఖండిస్తూ ఇక్కడున్న పాస్టర్లు ర్యాలీ తీస్తే నా పూర్తి మద్దతు తెలపడం జరిగింది
మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంటే అభివృద్ధి సంక్షేమం మరింత గొప్పగా మారుతుంది
లేబర్ కాలనీ క్రిస్టియన్ కాలనీలో యువత అంతా కింది స్థాయికి వెళ్లి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేయించాలి లేబర్ కాలనీ క్రిస్టియన్ కాలనీ ఓటింగ్ చూసి బిజెపి కాంగ్రెస్ వాళ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి
అభివృద్ధి ఇలాగే కొనసాగాలి తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కెసిఆర్ హ్యాట్రిక్ సాధించాలి వరంగల్ తూర్పు నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరేయాలి
ఈరోజు ఉదయం ఎనమామల మార్కెట్లో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వారి కార్యవర్గం మరియు మాజీ కార్యవర్గం,హమాలీ దాడువాయి,ఇతర కార్మిక విభాగాలన్నీ ముక్తకంఠంతో తనకు మద్దతు తెలిపి బహిరంగంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని వారు తెలపడం జరిగింది అది నా అదృష్టం
ఇక్కడున్న స్థానిక నాయకత్వం అంత సమన్వయంతో పనిచేసి ఈ డివిజన్ నుండి భారీ మెజారిటీ వచ్చే విధంగా చూడాలి ఐదేళ్ల కి ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఈ ఒక్క నెల కష్టపడి నాకోసం పనిచేయండి మిగతా 59 నెలలు మీకోసం నేను పని చేస్తా నియోజకవర్గంలో 2200 డబల్ బెడ్ రూమ్ నిర్మించాం, 3000 గృహలక్ష్మి,దళిత బంధు,బీసీ బంధూ, మైనారిటీ బంధూ ఇలా అన్ని పథకాలను అందిస్తాం
కేసీఆర్ గారి మేనిఫెస్టోలో 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలు వయసున్న ఉన్న మహిళలకు సౌభాగ్య లక్ష్మి ద్వారా మూడు వేల రూపాయల భృతి అందిస్తాం గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు,వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా 15 లక్షల వరకు వెసులుబాటు,పింఛన్ 2000నుండి 5000వేలకు,వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000 పెంచడం జరిగింది, ప్రతి ఇంటికి సన్న బియ్యం,కేసీఆర్ బీమా ద్వారా ఐదు లక్షల బీమా ఇలా సబ్బండ వర్గాలు ఆదుకునే విధంగా కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించారు కేసీఆర్ సంక్షేమ పథకాలు ద్వారా కల్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్ పౌష్టిక ఆహారం ఇలా కాన్పు నుండి కాటి వరకు కేసీఆర్ పథకం అందుతుంది వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మంచి విద్య అందించాలని ఏడుగుల పాఠశాలలు ఏర్పాటు చేశాం అత్యవసర వైద్యం కోసం మనం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 24 అంతస్తుల హస్పటల్ తో మనకు గొప్ప వైద్యం అందుతుంది ఇప్పుడు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నవారు ఒకరు వర్ధన్నపేట మరొకరు వంచనగిరి ఎక్కడినుండో వచ్చిన వీళ్ళకు ఈ ప్రాంత స్థితిగతులు ఇక్కడున్న ప్రజల అవసరాలు ఏం తెలుస్తాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరణించే వరకు ఇక్కడే ఉంటా ఇక్కడ గల్లీలో పెరిగినవాణ్ణి ఇక్కడి పరిస్థితులు చూసిన వాన్ని ఒక నిరుపేద బిడ్డగా లారీ డ్రైవర్ కొడుకుగా 500 నౌకరితో ప్రారంభించిన జీవితం కష్టపడి అంచలంచలుగా ఎదిగి నేడు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఎమ్మెల్యే చేస్తే ప్రజల గోసల్లో భాగస్వామ్యమయ్యా కరోనా కష్టకాలంలో 25వేల మందికి నిత్యవసర సరుకులు పంచాను, వరదలు వస్తే వారిని ఆదుకున్న,ఉద్యోగ అవకాశాల కోసం మన బిడ్డలకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశా నిరంతరం ఆపదని నా దగ్గరికి వచ్చిన వారికి ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉన్నా ఈ ప్రాంత బిడ్డలు గొప్పగా ఎదిగే విధంగా తోడ్పాటునందించే జిమ్మేదారి నాది ఎక్కడనుండో మభ్యపెట్టడానికి వస్తారు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కరోనా కష్టకాలంలో ఇప్పుడు వస్తున్న నాయకులు ఎక్కడికి పోయారని మీరు ప్రశ్నించాలి చైతన్యవంతమైన గడ్డ మంచి చేసే వారిని ఎన్నుకోండి
మీ ఆశీర్వాదంతో మరో మారు ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వస్తా నేడు స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇదే స్ఫూర్తితో ఈ నెల రోజులపాటు మొక్కవోని దీక్షతో పనిచేసి ప్రతి ఒక్కరిని కారు గుర్తుపై ఓటు వేయించి వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిని కొనసాగిద్దాం
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!