Sunday, April 20, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

సిఎం కేసిఆర్ లేకుంటే రాష్ట్రం ఆగమయ్యేది: శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ లోని BRS పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తో కలిసి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో నిర్వహించడం జరిగింది.

నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ… వీరంతా ఒక్కటే కుటుంబమా… కాదా…?

నీది కుటుంబ పరిపాలన కాదు కానీ కెసిఆర్ ది, కుటుంబ పాలనా? రాహుల్ గాంధీ సిగ్గు సిగ్గు.

రాహుల్ గాంధీ రాశి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ తాను ఒక లీడర్ కాదు అని నిరూపించుకుంటున్నాడు

లక్ష కోట్లకు మించని కాలేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని పేర్కొంటున్న రాహుల్ కు ఉన్న అవగాహన చూస్తే జాలి కలుగుతున్నది.

1969 ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, 2014లో కూడా రాష్ట్రం ఇచ్చినట్లే ఇచ్చి ఆలస్యం చేసి అనేకమంది తెలంగాణ ఉద్యమకారులను పొట్టన పెట్టుకుంది.

ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ ప్లీజ్ ప్లీజ్ అని ఆడుకోవడం ఏమిటి?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా బిజెపి మాత్రమే అధికారంలో ఉండాలని వేరే పార్టీలను అనగదొక్కాలని ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి

అందుకే రాహుల్ గాంధీ జోడో యాత్రలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో యాత్ర చేయలేదు. ఉంటే కాంగ్రెస్ లేదా బిజెపి తప్ప వేరే పార్టీ ఉండకూడదని వారి కుటిల యత్నం, అందులో భాగంగానే మహబూబ్ నగర్ లోబిజెపి నుంచి వచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు

పోతిరెడ్డపాడు, హంద్రీ నీవా, ఆర్డీఎస్ నుంచి అక్రమంగా నీటిని తరలించి తెలంగాణను ఎండబెట్టారని మీకు మరోసారి అవకాశం ఇవ్వాలా

నిండు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి మీ కాంగ్రెస్ పార్టీ వాడే మర్చిపోయారా

మహారాష్ట్రలో BRS పార్టీ ఎదుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్, బిజెపి కలిసి కుట్రలు చేస్తున్నాయి

3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలే బొంద పెట్టాలి.

కిరాయి సర్వేలు చేయించి బీసీలు ఓడిపోతారని పేర్కొంటూ బలహీనవర్గాలను కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది.

గత 70 ఏళ్లుగా గోసబడ్డ ఈ ప్రాంతంలో… సిఎం కేసిఆర్ లేకుంటే రాష్ట్రం ఆగమయ్యేది.

కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అధిష్టానం… కానీ ప్రజలుండే గల్లీనే BRS పార్టీకి అధిష్టానం

వ్యక్తులను కొనవచ్చు కానీ ఓటర్లను కొనలేరు,

కేసిఆర్, కేటీఆర్ లను తిడితే పెద్ద నాయకులం

టికెట్లను పొందిన వారి 5ఏళ్ల క్రితం చరిత్ర చూడండి

దాసరి తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా లాగా ఉంది కాంగ్రెస్ కథ. అనేకమంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో పగటి కలలు కంటున్నారు.

మా అభ్యర్థిని కత్తితో పొడిచినంత మాత్రాన భయపడేది లేదు.

ప్రాణాలు లెక్కచేయకుండా ఉద్యమం చేసిన తెలంగాణ ఇది. భయం అంటే ఎరుగని పార్టీ మాది.

మాది పేద వర్గాల పార్టీ. పేద ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారు.

రాహుల్ గాంధీ పదిసార్లు తెలంగాణలో తిరిగినా, పొర్లు దండాలు పెట్టినా వారికి జిల్లాలో, రాష్ట్రంలో ప్రజల ఆదరణ ఉండదు.

ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 సీట్లు గెలిచేది మేమే

కేసిఆర్ సీఎం అయ్యాక కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమంలో మా అందరిలా పోరాటం చేసి కష్టపడి ఆయన కూడా నాయకుడయ్యాడు. ఇంత గొప్ప నాయకుడు మాకు లేడని ఇతర రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!