
మైనార్టీల అభివృద్ధికి అన్నీ విధాల కృషీ చేస్తానని ఉప్పల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు.శుక్రవారం కాప్రా సర్కిల్ కార్యాలయం సమీపంలోని, డైమండ్ హిల్స్, ఎస్పీ నగర్ మజీద్లో ముస్లిం మైనార్టీల సోదరులను,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తో కలసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి,ఉప్పల్ అభ్యర్థికి గెలుపుకు సహకరించలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, యువ నాయకుడు ఉదయ్ కుమార్, ,ప్రితం, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు