టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ లో మీసేవ కళ్యాన్ పూరి కాలనీ, ఇందిరానగర్, ప్రశాంత్ నగర్, అంజత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలపై విస్తృతస్థాయి ప్రచారం చేసిన కాంగ్రెస్ శ్రేణులు చిల్కానగర్ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి వంజరి సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తు ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి,కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్. సుధాకర్ చారి, పలకల నరసింహారెడ్డి,టీపీసీసీ మైనారిటీస్ జనరల్ సెక్రెటరీ సంజయ్ జైన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ గణేష్ నాయక్, ఎయిమ్స్ చైర్మన్ షబ్బీర్ అలీ,హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సాల్మన్ బాబు, శ్యాం కుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్,ఉప్పల్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరేష్, చందు యాదవ్, పుల్లారెడ్డి, ఉప్పల్ డివిజన్ మైనారిటీస్ చైర్మన్ గజ్జల రాజు, శ్రావణ్ కుమార్, నిమ్మ సురేందర్ రెడ్డి, శాంతి యాదవ్, జితేందర్ రెడ్డి, యశ్వంత్, కార్తీక్ రెడ్డి, అమీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.