బుర్కచర్ల నుంచే వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కి బురద రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీల భరతం పడతాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట కోదాడలో వికలాంగుల జెండా ఎగరవేసేలా తమ కార్యాచరణ ఉంటుందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి
బుర్కచర్ల నుంచే వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కి బురద రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీల భరతం పడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని బుర్కచర్ల గ్రామంలో బుధవారం నిర్వహించిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో వికలాంగుల ఓట్లతోని గద్దెనెక్కిన సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా బురద రాజకీయాలు చేస్తూ వికలాంగుల బతుకులతో చెలగాటం ఆడుతు చట్టసభల్లో వికలాంగుల సమస్యలు ఊసే ఎత్తని కారణంగానే వికలాంగుల సమాజం రాజ్యాధికారం కోసం ఉద్యమించవలసిన పరిస్థితి నెలకొందని 76 ఏళ్ల స్వతంత్ర భారతవనిలో రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభల్లోను రిజర్వేషన్ కల్పించవలససిన రాజకీయ పార్టీల పై ఉన్నప్పటికీ పార్టీలు ఆ విధంగా కృషిచేయకపోవడంతోనే వికలాంగుల సమాజం రాజ్యాధికారం సాధనకై ఉద్యమించవలసిన పరిస్థితి నెలకొందని చాలీచాలని పింఛన్లతో బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతూ దేశంలో రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించవలసిన అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు వాటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని విజ్ఞప్తి చేసిన అన్ని పార్టీలు వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని విస్మరించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల తీరును నిరసిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యపేట కోదాడలో నియోజకవర్గాల్లో వికలాంగుల అభ్యర్థులను బరిలో నిలపాలని సంఘం రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట కోదాడలో వికలాంగుల జెండా ఎగరవేసేలా సంఘం నాయకులు కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు సంఘం మండల అధ్యక్షులు పిడమర్తి సైదులు ఆధ్వర్యంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నరసయ్య నిమ్మరపోయిన వెంకన్న పేరెల్లి బిక్షం కొండ వెంకన్న రావుల రాములు వాడుగుల రాములు నిమ్మర బోయిన రాములు కొండ సురేష్ కొండ నాగలక్ష్మి కొండ కరుణ నిమ్మరపోయిన వీరమ్మ తుమ్మ కొమ్మ వెంకటమ్మ నిమ్మరపోయిన వీరమ్మ కొండ రేణుక ఉప్పునూతల విజయ కొండ చంద్రయ్య కొండ చంద్రయ్య వాడుగుల నరసయ్య కోడి భద్రకల నిమ్మరపోయిన ఉప్పలయ్య కొండ ఎల్లమ్మ కొండ మైసమ్మ తదితరులు పాల్గొన్నారు