
సామూహిక కార్యక్రమాల వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే కాకుండా, మనలో ఐక్యతను పెంపొందించవచ్చని మఠం మహంతయ్య స్వామి అన్నారు. ఆదివారం కుషాయిగూడ వాసవి కన్యకా పరమేశ్వరి శివాలయంలో వీరశైవుల కార్తీక మాస వనభోజన సమారాధన భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా మీర్పేట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ తోపాటు మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గోల్లూరి అంజయ్య, కాసం మైపాల్ రెడ్డి, బండారి నీలం రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆగమ సలహా మండలి సభ్యులు (వీరశైవ ఆగమము)మఠం మాంతయ్య స్వామి వారి ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. శివాభిషేకం, అతిధి సత్కారం, ప్రవచనం, వనభోజన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ అధ్యక్షుడు బండే గౌడ, సమాజ సభ్యులు బాల్రాజ్, యావపురం విశ్వనాథం, గంగా ఈశ్వరయ్య, జ్ఞానేశ్వర్, రవి, సిద్దేశ్వర్ భీమ్ శంకర్, శంభు లింగం, కత్తి శివానంద్, మాన్కరి శివ, మఠం శివా, తదితరులు పాల్గొన్నారు.