
మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని వేంకటేశ్వరనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ భవనంలో ముదిరాజ్ సంఘం సమావేశమైన ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి ముదిరాజ్ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముదిరాజుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కొందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా వచ్చాయని, రాని వారు నిరుత్సాహ పడకూడదని, వారికి కూడా తప్పకుండా వస్తాయని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంకు 100 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తారని తెలిపారు. ముదిరాజ్ సంఘం వారు ప్రధానంగా వారి సంఘానికి సంక్షేమ సంఘం భవనం లేదని వారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చెమ్మ సాయి కుమార్ ముదిరాజ్, ఐలయ్య ముదిరాజ్, ముదిరాజ్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, కృష్ణమూర్తి, రాజేశ్వర్, శ్రీనివాస్, వెంకటేష్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, తిరుపతయ్య ఉపేందర్, నరసింహ, వెంకటేష్, సిద్ధులు, శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీనివాస్ మరియు స్థానిక నాయకులు శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.