ఉప్పల్ కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ మూతపడి ఆరు నెలలు గడుస్తున్న పట్టించుకోని స్థానిక ఉప్పల్ గౌడ కులస్తులు.
తొందరలో తెరిపించాలని మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపర్డెంట్ ఆఫీసర్ నవీన్ గారిని కలిసిన పంజాల శ్రవణ్ గౌడ్, మీనం పెళ్లి సురేష్ గౌడ్
సొసైటీ లో పనిచేస్తున్న పేద కార్మికులు ఆధారపడ్డ ముసలి వాళ్లు సొసైటీ మీద ఆధారపడ్డ గౌడ వితంతులు తల్లిదండ్రులు లేని గౌడ బిడ్డలు చాపలు గుడాలు మురుకులు పాపడాలు అమ్ముకునే వాళ్ళు గత 25 సంవత్సరాల నుండి సొసైటీ మీద ఆధారపడ్డ పేద బ్రతుకు జీవులు వారందరి పక్షాన పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ మీనం పెళ్లి సురేష్ గౌడ్ మూతపడిన కల్లుగీత కార్మిక సొసైటీని ఓపెన్ చేయాలని ముందుకు వచ్చి మల్కాజ్గిరి ES నవీన్ ని కలిసి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగినది. బీదవాళ్లు చిన్న చిన్న స్థాయి వాళ్ళు 100, 50 రూపాయలు మీద ఆధారపడ్డ గౌడ బిడ్డలు వాళ్లకు ఒక ఆధారం మన ఉప్పల్ గౌడ సొసైటీ. షుగరు బిపి లతో చాలా ఇబ్బంది పడుతున్న మన గౌడ బిడ్డలు పెద్దవాళ్లు వాళ్లందర్నీ దృష్టిలో పెట్టుకొని వారి గురించి మనం ఆలోచిద్దాం మనందరం ఒక్కటి అనే సంకేతం సమాజానికి ఇద్దాం అని తెలిపారు