Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

రెండు రైళ్లు ఢీ.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ లేకపోవడంతో పట్టాలపై ఆగి ఉంది..

అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరిననట్లు డీఆర్‌ఎం తెలిపారు.

ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. 7 గురు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!