
చిల్కానగర్ డివిజన్ ఆర్యవైశ్య సంఘంతో సమావేశమైన ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్, TSEWIDC ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్. ఆర్యవైశ్య సంఘం వారు ప్రధానంగా సంఘ సమావేశాలకు భవనం స్థలం లేక ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్యవైశ్యు సంఘం భవనం కోసం స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ ప్రక్రియ తర్వాత ఈ సమస్యను తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం వారు తమ సంపూర్ణ మద్దతు ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తు తీర్మానం చేశారు. అనంతరం రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి క్షణం అందుబాటులో ఉండే బండారి లక్ష్మారెడ్డి నాయకత్వం బలపరచాలని కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు.