కుషాయిగూడ నుండి కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రానికి కాలినడకగా (మహా పాదయాత్ర) వెళ్లి వచ్చిన… చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సోనియా గాంధీ నగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ (వెల్డింగ్ శ్రీను) ను అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. ఆదివారం కమలానగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వెల్డింగ్ శీనును మాల ధారణలో ఉన్న పలువురు అయ్యప్ప స్వాములు… శాలువాతో సత్కరించి గౌరవించారు. నవంబర్ 18వ తేదీన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి నడకను ప్రారంభించి… 38 రోజులు నడకను సాగించి … శబరిమలై చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అయ్యప్ప స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకుంటాననే దృఢ సంకల్పంతో పాదయాత్రను చేపట్టినట్లు ఆయన తెలిపారు. అయ్యప్ప ఆశీర్వాదంతో ఆ సంకల్పం కూడా తీరిందని వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు అయ్యప్ప నామస్మరణలు చేస్తూ… భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు సంతోష్ రెడ్డి, తదితరులు ఉన్నారు