Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: సీపీ డిఎస్ చౌహాన్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

అధికారులు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి

రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ పోలీసు సిబ్బందితో ఈరోజు ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలనీ, ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని రాచకొండ సీపీ అన్నారు.

ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని, ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్ళే రూట్ చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మరియు అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలని, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యలను సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని  బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైన ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలని,సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి  గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్ ఝ ఐపీఎస్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, రాచకొండ ట్రాఫిక్ డిసిపి 1 అభిషేక్ మహంతి ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ దరావత్ జానకి ఐపిఎస్, ఎస్ఓటి డిసిపి 1 గిరిధర్ ఐపీఎస్, మహేశ్వరం డిసిపి శ్రీనివాస్ ఐపీఎస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి ఐపిఎస్, డీసిపి సైబర్ క్రైమ్ అనురాధ ఐపీఎస్, డీసీపీ అడ్మిన్ ఇందిరా, ఎల్బి నగర్ డీసీపీ సాయి శ్రీ, ట్రాఫిక్ డీసీపీ 2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!