కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
శివ సాయి నగర్ లోని శివ సాయి దేవాలయంలో ఆదివారం జరిగిన కార్యవర్గం ప్రమాణస్వీకారం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ కుటుంబాలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి ఆత్మీయ సత్కారం చేశారు.
మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన శివ సాయి నగర్ అధ్యక్ష కార్యదర్శులు ఎంపల్లి పద్మా రెడ్డి, బర్ల రామచంద్రారెడ్డి, కొండగళ్ల అశోక్ ఇతర కార్యవర్గ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శాలువాలు కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శివ సాయి నగర్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాలనీ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను మంజూరు అయ్యేలా చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, జెర్రీ పోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పావని రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ప్రతినిధులు నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, బొజ్జ రాఘవరెడ్డి, ఎస్ ఏ రహీం,డాక్టర్ కుమారస్వామి, బివి నరసింహారెడ్డి, తిరుమలరెడ్డి, సారా అనిల్ ముదిరాజ్, గంప కృష్ణ, సారా వినోద్ , నరేష్, సింగిరెడ్డి నరసింహారెడ్డి, బర్ల రామచంద్రారెడ్డి, నారా నర్సింలు, కాసుల సురేష్ గౌడ్, సరికొండ రమేష్, జూపల్లి అశోక్, బాణాల రామకృష్ణారెడ్డి, షాబాద్ దామోదర్ రెడ్డి, వనం విజయ్ కుమార్, నారా శ్రావణ్, కందుల సత్యనారాయణ, రమేష్ రావు, శారదాంబ, మంజుల, సరోజిని, నిర్మల, శ్రీనివాస గాంధీ, సత్యనారాయణ రెడ్డి, వంశి రెడ్డి, అనంతుల ఇంద్రసేనారెడ్డి, బాలాజీ నాయక్, సత్యనారాయణ, హరే కృష్ణ, నాందేవ్,శ్యామ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు