
ప్రదక్షిణలు మనలను నిరంతరం కాపాడే దేవదేవునికి మనం అర్పించుకొనే అనేకానేక సేవలలో ముఖ్యమైనది ప్రదక్షిణ. గర్భాలయం లేదా ప్రాకారాల చుట్టూ మౌనంగా భగవంతుని నామాలను స్మరిస్తూ చేసే ప్రదక్షిణలు స్వామిని భక్తసులభుని చేస్తుంది. ఆగమ శాస్త్ర ప్రకారం ఏ ఆలయంలో అయినా 21 ప్రదక్షిణలు చేస్తే కొలువైన దేవత సంతృప్తి చెందుతారు. అది సాధ్యం కాని పరిస్థితులలో ఏ దేవతకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అన్న విషయం తెలుసుకొందాము. గణపతి —- 1 లేదా 3 శివుడు —- 3 విష్ణువు —- 4 సూర్య —— 7 అయ్యప్ప —— 5 సుబ్రహ్మణ్య — 6 హనుమాన్ — 5, 11, 51, 108 దుర్గాదేవి — 1,4, 9 ( అన్ని అమ్మవారి ఆలయాలలో) అశ్వద్ద వృక్షం — 7 ఇవి కాకుండా జాతక రీత్యా సంక్రమించిన గ్రహ అననుకూలతలను తొలగించుకోవడానికి నవగ్రహ లకు చేసే ప్రదక్షిణలు ముఖ్యమైనవి. నవగ్రహ మండపానికి ఎలా ప్రదక్షిణలు చేయాలి అన్న దాని గురించి రకరకాల సిద్దాంతాలు ఉన్నాయి. కాని అధిక శాతం పెద్దలు నిర్ణయించిన విధానం ప్రకారం తొలుత సూర్యునికి నమస్కరించి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. తరువాత అప్రదక్షిణంగా రాహు కేతులను సంతృప్తి పరచడానికి రెండు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ సమయంలో నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం. రాని పక్షంలో ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధ గురు శక్ర శనిభ్యేశ్చ రాహవే కేతవే నమః అని ప్రార్దించవచ్చును. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామ భక్త హనుమాన్ కి చేసే ప్రదక్షిణలు మరో ఎత్తు. ఆంజనేయుని కి ప్రదక్షిణలు అంటే మక్కువ. ఆ వివరాలు రేపు పెడతాను. ఇలపావులూరి (జనార్ధన) వెంకటేశ్వర్లు, విజయవాడ