
అమ్మాయిపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
గడప గడప కు కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా నేడు ఉదయం చిన్నంబావి మండలం అమ్మాయి పల్లి గ్రామంలో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పర్యటించారు.
గ్రామంలో ప్రజలు,మహిళల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తె సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసే ఆరు గ్యారెంటీ ల గురించి గ్రామ ప్రజలకు వివరించారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని ప్రజలకు పీలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు,మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు