
సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోను ఓటర్లకు వివరించే బిఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉంది : ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద
ఈరోజు ఐడిపిఎల్ లోని వై.ఎం.ఎస్ ఫంక్షన్ హాల్లో 128- డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో సంక్షేమం, సుపరిపాలనతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని దీనిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. డివిజన్ లోని యువకులు, మహిళలను సమన్వయం చేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ డివిజన్లో చేపట్టిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మూడవసారి బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, కర్ణ కంటి మల్లేష్, మక్సుద్ అలీ, అశోక్, డి కృష్ణమూర్తి, సంజయ్, ప్రభాకర్ గుప్తా, వరప్రసాద్, పీ.వెంకటేష్ గౌడ్, శేఖర్ రావు, కే సాంబయ్య, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, స్వర్ణలత రెడ్డి, స్వప్న, కే శ్యామల, స్వర్ణ, మేహరునిస్సా , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు