
ఎమ్మెల్యే అనుచరుడు బొల్లి రఘుపతి తో పాటుగా 15 మంది యువకులు BRS నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిక.
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డ్ కి చెందిన ఎమ్మెల్యే భిరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరులు బొల్లి రఘుపతి తో పాటు గ్రామానికి చెందిన 15 మంది యువకులు నేడు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే భిరం పాలనలో అమాయక ప్రజలపై అరాచకాలు,కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ది చేసింది ఏమి లేదు అని,గతంలో జూపల్లి కి వ్యతిరేకంగా పని చేసి ఇప్పుడు బాధ పడుతున్నాం అని అందుకే జూపల్లి ని మళ్ళీ గెలిపించుకోవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరమని నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో నర్సింగరావు పల్లి నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ ,కృష్ణ , నర్సింగ రావు పల్లి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు