శబరిమలై కి… సైకిల్ యాత్ర
- ఈసీఐఎల్ నుంచి వెళ్లిన అయ్యప్ప స్వాములు
కుషాయిగూడ: ఈసీఐఎల్ నుంచి కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి… మాల ధారణలో ఉన్న అయ్యప్ప స్వాములు సైకిల్ యాత్ర చేపట్టారు. శశిధర్ రెడ్డి, సంతోష్ గురు స్వామీల ఆధ్వర్యంలో ఆదివారం కమలానగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడులు కట్టుకొని సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయంలోని తాంత్రిలు ప్రత్యేక పూజలు చేసి సైకిల్ యాత్రకు బయలుదేరిన స్వాములను ఆశీర్వదించారు. అలాగే యాత్రకు వెళుతున్న స్వాములను బంధుమిత్రులు, మాల ధారణ లో ఉన్న అయ్యప్ప స్వాములు అభినందనలు తెలుపుతూ వీడ్కోలు పలికారు. అనంతరం అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ యాత్రకు బయలుదేరారు. సైకిల్ యాత్ర చేపట్టిన వారిలో… కుషాయిగూడ కు చెందిన రాము, సాయి, నవీన్, వెంకటేష్ స్వాములు ఉన్నారు.