
ఎడాపెడా క్యూఆర్ కోడ్లను స్కాన్ (QR Code Scanner) చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ముఖ్యంగా ఈమెయిళ్లకు వచ్చే క్యూఆర్‌కోడ్లను ఫోన్‌తో స్కాన్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరం..
వీటితో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశముందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇమేజ్ రూపంలోని టెక్స్ట్, క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈమెయిళ్లను హ్యాకర్లు పంపిస్తున్నారని వివరిస్తున్నారు. ఈమెయిల్ బాక్సుల్లోకి చొరబడటానికి ప్రయత్నించే మోసగాళ్లను సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు సమర్థంగా వడపోస్తున్నప్పటికీ మోసగాళ్లు ఇలాంటి కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్‌కు సంబంధించి అర్జంట్ యాక్షన్ నీడెడ్ వంటి హెడర్లతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈమెయిల్ సెక్యూరిటీ సాధనాల కంట పడకుండా నేరగాళ్లు క్యూఆర్ కోడ్లను వాడుకోవటం ఎక్కువైంది. నిజానికి ఫిషింగ్ కోసం క్యూఆర్ కోడ్లను ఉపయోగించటం కొత్తేమీ కాదు గానీ వీటిని గుర్తించకుండా ఉండటానికి లేయర్ల పద్ధతిని వినియోగించుకుంటున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇమేజ్‌లతో కూడిన ఇలాంటి కోడ్లను ఫోన్‌తో స్కాన్ చేస్తే చిక్కులు తప్పవు.