సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పంజాల శ్రావనకుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న సేన ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి వేడుకలను చిలకనగర్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆదర్శ్ నగర్.HP పెట్రోల్ బంక్ ఎదురుగా
చిలకనగర్ రోడ్డు.లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పంజాల శ్రావనకుమార్ గౌడ్ మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. బహుజనుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.