Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా “సారంగాదరియా”మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో ఉమాదేవి & శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం” సారంగదరియా”
ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదల అయ్యింది ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ: సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది ఫ్యామిలీ చిత్రం గా త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర కి ఉమాదేవి కి మరియు ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న పద్మారావు అలియాస్ పండు కి “సారంగదరియా” సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ. మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ కి చాలా థాంక్స్ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము మా “సారంగదరియా” అందరికీ నచ్చేలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ తెలిపారు.
డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ..
అందరికీ నమస్కారం నేను “సారంగదరియా” మూవీ తో దర్శకుడిగా పరిచయమవుతున్నను ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఉమాదేవి & శరత్ చంద్ర కి ధన్యవాదాలు.
ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ కి థాంక్యూ .
చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యాలి అనుకుంటున్నాము త్వరలోనే మిగతా విషయాలు తెలియజేస్తాము ఆని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!