ఇంజక్షన్ వికటించడంతో ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకర ఆసుపత్రిలో చోటుచేసుకుంది.. రాంపల్లిలో నివసించే పచ్చిమట్ల గోవర్ధన్ (50) వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్.. అతని కాలుకు ఇన్ఫెక్షన్ కారణంతో మంగళవారం ఈసీఐఎల్ లోని శ్రీకర ఆసుపత్రికి వచ్చాడు.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఈరోజు అతడికి ఇంజక్షన్ చేయనీకి వెళ్లగా ఆ ఇంజక్షన్ తనకు పడదని వారించిన పట్టించుకోకుండా ఇంజక్షన్ చేయడంతో నిమిషాల వ్యవధిలో ప్రాణాలు వదిలాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. వైద్యుల నిర్లక్ష్యంపై మృతుడి బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు.. ఆసుపత్రి యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యం సమాధానంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు