
సమాచార హక్కు చట్టం వారోత్సవాల ప్రత్యేకం
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతమంది అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో పేరుకుపోయిన అవినీతిని సమాచార హక్కు చట్టంతో చెక్ చెప్పవచ్చునని జాతీయ అవార్డు గ్రహీత సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త, బొడ్డేడ జగ్గఅప్పారావు (జగన్) పేర్కొన్నారు .
నేటి సమాజంలో రోజు రోజుకు పెరుగుపోతున్న ఆర్ధిక అసమానతలు లేనివాడు లేకుండా పోవడం, ఉన్నవాడు మరింతగా అంతకంతకు అందనంత ఎత్తుకు పెరిగిపోవడం వంటి ఆర్ధిక అసమానతలు ఒక ఎత్తైతే, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ పధకాలు అందకుండా ప్రజలకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా వివక్షత చూపుతుండడం మరొక ఎత్తని ఇలా ఎత్తులకు, పై ఎత్తులు వేస్తూ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వారి చుట్టు ప్రజలను తిప్పించుకోవడం, కొంతమంది అధికారులు కూడా ఇదే వైఖరితో ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రజలను పదే పదే తిప్పించుకుంటూ కూడా వారి సమస్యలను గాలికి వదిలేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పలితంగా వారి పరిస్థితి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా దుర్భర పరిస్థితులలో జీవితాన్ని సాగిస్తూ, కొనసాగిస్తున్న సామాన్య జనం కోసం ప్రజల కోసం) 2005 లో వచ్చిన మహాఅద్భుత చట్టం సమాచార హక్కు చట్టమని, సామాన్య జనానికి ప్రజలకు ప్రభుత్వ పధకాలు అందకుండా వారి పట్ల వివక్షత చూపుతున్న నేతలు, అధికారులను కట్టడి చేసే చట్టం వారి ఎత్తులను చిత్తు చేస్తూ, పాలకులు, అధికారులు లోపభూయిష్టంగా, నిబంధనలకు విరుద్ధంగా సాగించే పరిపాలనను వెలుగులోకి తెచ్చే చట్టం సమాచార హక్కు చట్టమని, ఇంతటి విశిష్టతను, ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ చట్టం భారతదేశంలోనే చట్టాలలో కెల్లా అత్యఅద్భుతమైన చట్టం సమాచార హక్కు చట్టమని, ఈ చట్టం భారతదేశంలోనే నెం వన్ చట్టంగా నిలుస్తుందని పబ్లిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు, జాతీయ అవార్డు గ్రహీత, సమాచార హక్కు చట్టం ఉద్యమ కార్యకర్త, సామాన్యుడు
బొడ్డేడ జగ్గ అప్పారావు(జగన్) పేర్కొన్నారు.
ఈ చట్టం భారతదేశంలో 2005 అక్టోబరు 12న అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టం మొట్టమొదటిసారిగా స్వీడన్ దేశంలో 1776లో అమలులోకి వచ్చిందని తెలిపారు. అమెరికాలో 1966లో, ఫ్రాన్స్ లో 1993లో, ఇంగ్లాండులో 2000లో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో 2002 సంవత్సరం నుంచి సమాచార చట్టం ఉందన్నారు.
సమాచార హక్కు చట్టంతో గాడి తప్పుతున్న పరిపాలనను గాడిలో పెట్టవచ్చునని, పరిపాలనలో పరిపక్వతను తీసుకురావచ్చునని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పధకాల వివరాలను తెలుసుకోవచ్చునని, ఆ పధకాలు ఏ విధంగా అనులుపుతాన్నాయి అనేది తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రభుత్వ పధకాలు అర్హులైన పేద ప్రజలకు అందుతున్నాయా? లేదా పేద ప్రజల పేరు చెప్పి అనర్హులు ప్రభుత్వ పధకాలు పొందుతున్నారా? అనేది తెలుసుకోవచ్చునని తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడిన గిరిజనలు కోసం గిరిజన సంక్షేమం కోసం వెచ్చిస్తున్న నిధులు వివరాలను తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలను తనీఖీ చేయవచ్చునని, గ్రామ పంచాయితీ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, పోలీసు స్టేషన్, కలెక్టర్ కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం మొదలగు ఏ ప్రభుత్వ కార్యాలయంనైనా తనీఖీ చేసే అధికారం ప్రజలకు ఉందన్నారు