
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న దానం కార్యక్రమంలో పాల్గొన్న, ఇరిని ఇందిరా, హైదరాబాద్ రుచులు ఫుడ్ బ్లాగర్, మరియు బుర్ర ప్రశాంత్, అనిల్ రచమల్ల ,శ్రీకాంత్ రెడ్డి, ఫిలిమ్ డైరెక్టర్ మరియు సింగర్ పాల్గొన్నారు. బుర్ర ప్రశాంత్ మాట్లాడుతూ, ఈ రోజు ఈ అన్న దానం లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు,ఆకలి అందరిది. అన్నం మాత్రం కొందరిదే. ఇక్కడ అందరి ఆకలి ఒక్కటే. మన అందరి ఆకలి తీర్చే పదార్థం ఒక్కటే. ఓధనవంతుడి ఆకలి ఒక్కటే. ఒక పేదవాడి ఆకలి ఒక్కటే. ప్రాప్తం లేని వాడికి పట్టెడు అన్నము పెట్టిన వారు నిజమైన దేవుళ్ళు. ఆకలి బాధ అందరికీ సమానమే మిత్రమా. ఏదీ మన చేతిలో లేనప్పుడు అన్నీ ఉండగానే ఒక నలుగురికి మనం సాయం చేద్దాం. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నము పెడదాం. ఏది నీది..? ఏది నాది..? ఎప్పటికైనా, ఎవరికైనా చావు తప్పదు. పోయేదేముంది మిత్రమా కాస్త సాయాన్ని అందిద్దాం. నేడు ఆకలి కేకల రాజ్యంలో రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నేడు ఆహారానికై అలుపెరగని పోరాటం. చేస్తున్నారు ఫౌండేషన్ టీం కు నాయొక్క ధన్యవాదాలు అన్నారు. అనిల్ రాచమల్ల సోషల్ ఆక్టీవిటిస్ మాట్లాడుతూ,రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మంచి ప్రాధాన్యత సేవ చేస్తున్న శంకర్ గారికి ధన్యవాదాలు తెలిపారు, ఇకనైన వికసించేన మానవత్వం మరణించేనా ఈ పేదరికం ఫ్రెండ్స్ మన రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ప్రస్తుతం మతిస్థిమితం కోల్పోయినవాళ్ళు 30 మంది అభాగ్యులు ఉన్నారు. మీ పుట్టినరోజులు లేదా పెళ్లిరోజులు, మరేదైనా మీఇంట్లో శుభాకార్యములు ఉంటే మన ఈ రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో జరుపుకోండి. ఒక్కపూట అన్నదానం చేసి వారందరి ఆకలిని తీర్చినవారు అవుతారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలకన్నా అన్నదానమెంతో గొప్పది ఫ్రెండ్స్ దయచేసి ఎవ్వరూ కూడా అన్నాన్ని వృధా చేయకండి అని కొనియాడారు.. శ్రీకాంత్ రెడ్డి , ఫిలిమ్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ మన రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్న దాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు