Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులను నియమించిన ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారులను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ నియమించారు.  

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జిహెచ్ఎంసి  భూసేకరణ  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న వి.లక్ష్మినారాయణ (సెల్ నెం. 95501 47479) రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా మలక్ పేట్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న కె. వెంకట ఉపేందర్ రెడ్డి ( సెల్ నెం. 94408 15870), అంబర్ పేట్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ల్యాండ్ అక్విజిషన్ జనరల్ గా పనిచేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ బి.అపర్ణ (సెల్ నెం. 96188 77044), ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న వెంకటేష్ దొత్రె (సెల్ నెం.78424 52571), జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ రెవెన్యూ డిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న టి.రవి (సెల్ నెం. 94408 15891), సనత్ నగర్ నియోజకవర్గానికి హెచ్.ఎం.డి.ఏ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి.కిషన్ రావు (సెల్ నెం. 96189 02253), నాంపల్లి నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ల్యాండ్ ప్రొడక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న వి.లావణ్య (సెల్ నెం 94408 15856), కార్వాన్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్న కొమురయ్య (సెల్ నెం. 94408 15892), గోషామహల్ నియోజకవర్గానికి హెచ్.ఎం.డి.ఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న వి.విక్టర్ (సెల్ నెం. 98666 79319), చార్మినార్ నియోజకవర్గానికి చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న ( సెల్ నెం.96182 49933), చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎం.సూర్య ప్రకాష్ (సెల్ నెం. 94408 15890), యాకత్ పుర నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఇ.వెంకటచారి (సెల్ నెం. 94408 15887), బహదూర్ పుర నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ల్యాండ్ పూలింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆర్.దశరత్ సింగ్ (సెల్ నెం. 99481 68481), సికింద్రాబాద్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎస్.ఎల్లా రెడ్డి (సెల్ నెం. 99892 29215), సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్ ( సెల్ నెం. 72880 66777) లను రిటర్నింగ్ అధికారులుగా నియమించామని, వీరు సంబంధిత నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసే కార్యాలయాల వివరాలను నోటిఫికేషన్ జారీ చేస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వివరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!