Tuesday, December 24, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ రైలు ప్రయాణం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఊహించని విధంగా రైలులో ప్రయాణించి ప్రజలతో కలిసిపోయారు. సోమవారం చత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి రాయ్‌పూర్‌కు వెళ్లేటప్పుడు ఈ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

బిలాస్‌పూర్-ఇత్వారీ ఇంటర్‌సిటీ రైలు స్లీపర్ తరగతిలో రాహుల్ గాంధీ, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్, ఇతర నేతలు ప్రయాణించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తోటి ప్రయాణికులతో ముచ్చటించారు.

రైల్లోని హాకీ క్రీడాకారిణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నారు. స్థానిక రాజనంద్‌గావ్‌లోని మైదానం హాకీ ఆడేందుకు అనువుగా లేదన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని కూడా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ ‘ఖేలో ఇండియా’ ద్వారా ఆమెకు అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. శిక్షణ వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఈ విషయంపై స్పందించింది. ‘‘రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించడం వారికో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జననేతకు, అభినేత (నటుడు) ఉన్న తేడా ఇదే’’ అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు చేసింది.

రాహుల్ గాంధీ ఈ సర్‌ప్రైజ్ రైలు ప్రయాణం ద్వారా ప్రజలకు దగ్గరయ్యడానికి ప్రయత్నించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రయాణం ద్వారా రాహుల్ గాంధీ ప్రజల సమస్యలపై అవగాహం పెంచుకున్నారని, వారి కోసం కృషి చేయాలని ప్రజలకు సంకేతం ఇచ్చారని కూడా వారు అంటున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!