మెగా క్యాంపు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీ చక్రి విద్యానికేతన్ హై స్కూల్, చక్రిపురం చౌరస్తా,కుషాయిగూడ లో నిర్వహించారు. భారీ ఎత్తున ఈ హెల్త్ క్యాంపులో చర్లపల్లి డివిజన్ వాసులు పాల్గొన్నారు.. గత 25 సంవత్సరాలుగా మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గం లో అనేక రకాల ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న రాగిడి లక్ష్మా రెడ్డి . ఈ మెగా క్యాంప్ లో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆప్తమాలజీ,విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మధుర చారిటబుల్ ట్రస్ట్ వారు సొంత ఖర్చుతో ఉచితంగా ఉప్పల్ నియోజకవర్గం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తున్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి.. ఈ మెగా మెడికల్ క్యాంపును కాసుల పోచయ్య గౌడ్, ఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి, రాఘవరెడ్డి, పలకల నరసింహారెడ్డి, ఎన్. సుధాకర్ చారి,తమ చేతుల మీదుగా ప్రారంభించినారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లో అన్ని డివిజన్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ట్రస్ట్ ద్వారా అనేకరకాల సేవా కార్యక్రమాలు మహిళలకు ఉపాధి కల్పన ధ్యేయంగా కుట్టుమిషన్లు, అల్లికలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమానాలు విదేశీ చదువులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ వారికి ఉద్యోగాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా ట్రస్టు సేవలు నిర్వహిస్తారని తెలియజేశారు. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రతిసారి సహకారం అందిస్తున్న మధుర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుకు కిమ్స్ హాస్పిటల్ మరియు సాధురం కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్, చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాసుల సతీష్ గౌడ్, చక్రిపురం కాలనీ అధ్యక్షుడు రాఘవరెడ్డి,బూడిద శ్రావణ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, తిరుమలేష్ శెట్టి, గుప్తా,సింగం కిరణ్, సందీప్ గౌడ్ ,రాజలింగం, ప్రశాంత్ ఎండి రిజ్వాన్, ఖదీర్, ముస్తాక్, డాక్టర్ శ్రీనివాస్, యువ నాయకులు బి ప్రేమ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నీరజారెడ్డి, సునీల్ కుమార్ (మున్నా )వేణు, గంగ, శ్రీకాంత్, కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.