ఉప్పల్ నియోజకవర్గం హౌసింగ్ బోర్డ్ డివిజన్, ఎన్టీఆర్ నగర్ నుండి కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై, బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి హర్షం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మి, హౌసింగ్ బోర్డ్ డివిజన్, ఎన్టీఆర్ నగర్ లో, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ ,మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో, ఎన్టీఆర్ నగర్ అధ్యక్షులు వాసు చారి,ఎన్టీఆర్ నగర్ ప్రధాన కార్యదర్శి భీష్మ చారి, ఎన్టీఆర్ నగర్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మధు, మంజుల గార్ల అనుచరుగణం స్వచ్ఛందంగా 100ల మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు, బండారి లక్ష్మారెడ్డి కి తమ పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.