కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దూలపల్లి ప్రజల ఆహ్వానం మేరకు మల్లన్న ఆలయంలో నిర్వహించిన మల్లన్న ఎల్లమ్మ బోనాల పండుగకు ప్రత్యేక అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్, అనంతరం ఆలయ కమిటీ వారు రాగిడి లక్ష్మారెడ్డిని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ప్రజలందరూ మల్లన్న ఎల్లమ్మ దేవతల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాగే ప్రతి ఏటా బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.