బోనగిరి కలెక్టరేట్లో రాచకొండ కమిషనర్ Dr. తరుణ్ జోషి ఐపీఎస్ అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన అంబోజు అనిల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ ని అభినందించడం జరిగింది ఇతను ఫిబ్రవరి నెలలో 22 నుంచి 25 వరకు థాయ్లెండ్ దేశములో జరుగుతున్న 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2024 (AMA) లో 45 సంవత్సరం ల విభాములో నాలుగు పతకాలు (1 బంగారు పతకం, 3 కాంస్య పతకాలు) సాధించడం జరిగింది, అందులో 4×400 మీటర్లు రిలే లో బంగారు పతకం మరియు 800 మీటర్లు ,1500 మీటర్లు, 5000 మీటర్లు, పరుగుపందంలో కాంస్యం పతకాలు సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో భువనగిరి డిసిపి M.రాజేష్ చంద్ర IPS, AR అడిషనల్ డిసిపి B.వినోద్ కుమార్, AR ఏసిపి Ch.మహేశ్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు K.వెంకటేశ్వర్లు, M.శేఖర్, Ch.శ్రీకాంత్, D.శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు ఉన్నత అధికారులు అభినందించడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో మరిన్ని పతకాలు సాధించి పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి ఆకాంక్షించినారు.