Wednesday, December 25, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన: కలెక్టర్ గౌతమ్

భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించాలి,
జిల్లా వ్యాప్తంగా ప్రచారరథాల ద్వారా సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్,
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఈనెల 16 నుండి జనవరి 26వ తేదీ వరకు నిర్వహించనున్న భారత్ వికసిత్ సంకల్ప్ యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్, అన్న యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జీవనజ్యోతి భీమా యోజన వంటి పథకాలపై గ్రామాలలో ప్రజలకు అర్థమయ్యే విధంగా భారత్ వికసిత్ సంకల్పయాత్ర ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రచార యాత్రను విజయవంతం చేయాలని, ప్రతి గ్రామానికి ప్రచార రథం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆయా పథకాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకువెళ్ళి వారికి పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా నూతన లబ్ధిదారుల గుర్తింపులో పూర్తి స్థాయిలో అందరికీ లబ్ధి చేకూరేలా అధికారులు తమ విధులు నిర్వహించాలని తెలిపారు. భారత ప్రభుత్వం పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, ఇళ్ళు, ఆహార భద్రత, పౌష్టికాహారం, విద్య, వైద్యం, విద్య ,స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని… ఈ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడంతో పాటు కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ప్రచార రథాలు వచ్చాయని, వాటి ద్వారా జిల్లాలో శనివారం నుంచి జనవరి 26వ తేదీ వరకు ప్రతి రోజు ఆయా మండలాల్లోని గ్రామాల్లోని గ్రామపంచాయతీలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విధంగా వాహనం వారీగా రూట్ మ్యాప్ , కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ వాహనాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశం ఆడియో వీడియోతో పాటుగా ఎల్ఈడీ స్క్రీన్స్ ద్వారా గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారు నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి మండలానికి నోడల్ అధికారులను నియమించడంతో పాటు సంబంధిత శాఖలు చేపడుతున్న కార్యక్రమాలపై కరపత్రాలు, పుస్తకాలు ప్రజలకు అందజేసి ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాన్ని సేకరిస్తారన్నారు. ప్రజలు ఈ క్యాంపులకు హాజరయ్యేలా గ్రామ కార్యదర్శులు గ్రామాలలో చాటింపు వేయాలని, కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సిందిగా సూచించారు. . జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు విజయవంతం చేసేందుకు సహకారం అందించాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని, ఆయా పథకాలలో ఏ విధంగా లబ్ది పొందుతున్నారు, ఏ విధమైన లాభం జరుగుతుందన్నదన్నది లబ్ధిదారుల వ్యక్తిగత అనుభవాలను అందరితో పంచుకునేలా చూడాలన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చి, కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. సంకల్ప్ యాత్ర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఐటీ ప్లాట్ ఫామ్ లలో ప్రీ ఈవెంట్ సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి నోడల్ అధికారులుగా జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, ఎల్డీఎమ్ శ్రీనివాసులు, జిల్లా సివిల్ సప్లయి అధికారిణి విజయలక్ష్మీ,, డీపీవో రమణమూర్తి వ్యవహరిస్తారని కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!