చెట్లను పెంచడం సామాజిక బాధ్యత అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళ వారం కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మన బడి కార్యాలయంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సృష్టిలో సమస్త జీవరాసులు ఒకదానిపై మరొకటి ఆధారపడి పర్యావరణాన్ని కలుషితం చేయడాన్ని ఆపివేద్దాం. మన అందరికీ ఇల్లు లాంటి భూమాతను చాలా ఆరోగ్యకరంగా, ఆకు పచ్చగా ఉంచేందుకు కృషి చేద్దాం అని
రానున్న రోజుల్లో పర్యావరణ మార్పులు, కాలుష్య భూతమే ప్రపంచ మానవాళికి పెను సవాలుగా మారబోతుంది అని ఆ ప్రమాదాన్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. పచ్చదనాన్ని కాపాడటంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం కూడా అంతే ముఖ్యం అని ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం నివసించటంతో పాటు రానున్న తరాలకు ఈ భూమిని, పర్యావరణ సమతుల్యతను అంతే ఆరోగ్యంగా అందించడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM బాపు రెడ్డి , ఉపాధ్యాయులు ,విద్యార్థులు ,BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.