Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు… ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు లో రాజ్ థియేటర్ నుండి టేక్కే వరకు కౌన్సిలర్ కాల్వ సరస్వతి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం లో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు అలాగే గత ప్రభుత్వానికి వైయస్సార్ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని మరోసారి వైయస్సార్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు

ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 13 వ వార్డులో 164 వరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎంతోమంది పేదవారికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యానికి మరియు ముఖ్యంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు చూపించే ప్రేమాభిమానాలు ఎంతో సంతోషాన్నిస్తున్నా అన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇంతటి సంక్షేమ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ నంద్యాల మూడవ పట్టణ అధ్యక్షులు పడకండ్ల సుబ్రహ్మణ్యం ,జాకీర్ హుస్సేన్, వార్డు వైసిపి నాయకులు టైలర్ శివ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్,SN కద్రి,చిలుకలు గురునాద్, మాజీ కౌన్సిలర్ చింత శ్రీను, శిరిగిరి రమేష్, అడ్వకేట్ మాధవరెడ్డి, సత్యనారాయణ,దేవక్క,RV సుబ్బారెడ్డి, పరమేశ్వర రాజశేఖర్, శంకర్ నాయక్,గెలివి రామకృష్ణ,మనోహర్ రెడ్డి,కృష్ణ రెడ్డి, అల్లా బకస్, మరియు వైసీపీ నాయకులు కౌన్సిలర్స్ భాస్కర్, కలం భాష శాదిక్ భాష కో ఆప్షన్ సభ్యులు సలాం ముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరం ,మాజీ ౌన్సిలర్ లక్ష్మీనారాయణ, సోమశేఖర్ రెడ్డి, రహంతుల్లా, కిరణ్ కుమార్ ,పార్ధుడు, అనిల్ అమృతరాజ్ మరియు చివాలయ సిబ్బంది ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!