గ్రామపంచాయతీ కార్మికులకు గత రెండు మూడు నెలల నుండి వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు వారి కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా దసరా పండుగ ఉండి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు వారి కుటుంబాలు అందరు కూడా పస్తులు ఉండవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనికి అందటికీ కారణము రాష్ట్ర ప్రభుత్వమే అని అన్నారు, పెండింగులో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు,గురువారం రోజున రెబ్బన మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాలు చెల్లించాలని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు, అలాగే సమ్మె కాలంలో ఇచ్చిన ఒప్పందాన్ని అమలు చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000ఇవ్వాలని పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.వేతనాలు చెల్లించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు రత్నం దేవాజి,వెంకటేష్, సునీల్,లాల్ సింగ్, ప్రవీణ్,కిషన్ తోపాటు తదితరులు పాల్గొన్నారు