మేడ్చల్ జిల్లా యువజన కాంగ్రెస్ (యస్సీ) విభాగం అధ్యక్షులు పత్తీ కుమార్, గాంధీభవన్‌లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పత్తీ కుమార్ మాట్లాడుతూ, మహేష్ కుమార్ గౌడ్ గారి ఎన్నికను యూత్ కాంగ్రెస్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నదని తెలిపారు. ఆయన ఒక ప్రజాస్వామ్య యోధుడు, యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు.
మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మరింత కృషి చేస్తారని పత్తీ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, యువత రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. యువత కారణంగానే కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుత్థానం చెందుతుందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.