ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిభింబాలుగా నిలుస్తాయని వాటి విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ప్రముఖ వ్యాపారవేత్త పాండాల శివకుమార్ గౌడ్ అన్నారు. రాజపేట మండలం పాముకుంట గ్రామంలోని 12 పడగల శ్రీదేవి, భూదేవి నమేత వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటి చైర్మాన్ గా కుషాయిగూడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పాండాల శివకుమార్ గౌడ్ ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ పూజారి తిరుణహరి నరేష్ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులు శివకుమార్ గౌడ్ ను చైర్మాన్ గా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా శివకుమార్ గౌడ్ దేవాలయ కమిటి సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆలయక కమిటీ సభ్యులు, గ్రామాస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని అన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈఆలయ అభివృద్ధి కమిటీకి చైర్మాన్ గా తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ పూజారి నరేష్, రాపోలు అమరేందర్రెడ్డి, విశ్వాస్ రెడ్డి, వుండరికాన్ రెడ్డి, పిచ్చిరెడ్డి, శకర్, గంగిశెట్టి రాజు, రాములునాయక్, బాల్ రాజు, రాంజీనాయక్, బాల్ లక్ష్మి, రమేష్ నాయక్, స్వామి, నరేష్ రెడ్డి, జంగారెడ్డి, అనిల్, నీలంసాగర్, బాలకిషన్, శ్రీను కమిటి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.