మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పద్మశాలి సంఘం : తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నిలిచి ఉంటుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిట్టి మిల్లగణేష్ నేత, భావన రుషి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సీతా ఆంజనేయులు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లు అన్నారు.శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 12 వ వర్ధంతిని దమ్మాయిగూడలోని పద్మశాలి టౌన్ షిప్ వద్ద భావనా ఋషి కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సొసైటీ ఆవరణలోని .కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి,బాపూజీ అమర్ రహే అని నినాదాలు చేస్తు ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా అధ్యక్షులు గణేష్ నేత సీతాంజనేయులు నేత, ప్రణీత శ్రీకాంత్ గౌడ్ బొమ్మ ప్రవల్లిక అమర్ నేత,మాట్లాడుతూ తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొని,జైలు జీవితం అనుభవించిన గొప్ప నాయకుడు బాపూజీ అని తెలిపారు.92 ఏళ్ల వయసులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ పట్ల తన చిత్త శుద్ధిని చాటిన మహనీయుడని కొనియాడారు. తొలి దశ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని త్యజించి తెలంగాణ సకారమయ్యేదాకా పదవులు తీసుకొనని శపథం పూని మాటకు కట్టుపడ్డ వ్యక్తి బాపూజీ అని తెలిపారు.అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.బాపూజీ ఆశయ సాధన కొరకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తునందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ, అదే క్రమంలో వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర మాద హరినారాయణ, ఉపాధ్యక్షులు బోనకుర్తి అర్జున్,బొద్దుల వెంకటగిరి ప్రసాద్, కార్యదర్శులు సబ్బం రామకృష్ణ, కటకం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిలు బోనకుర్తి శ్రీనువాస్, ముఖ్య సలహాదారులుకూరపాటి నాగేశ్వరరావు, బొమ్మ అమరేందర్లు, విజయ్ కుమారస్వామి, ప్రశాంత్,చక్రపాణి,భావన ఋషి కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కోశాధికారి అవ్వారి రామకృష్ణ,డైరెక్టర్ లు విడం సుదర్శన్,కర్నాటి నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.