భావ స్వేచ్ఛను ఎవరు హరించలేరని, సామాన్యుల గొంతుకగా ఉన్న ఆన్ లైన్ మీడియా అవసరం సమాజానికి ఎంతో ఉందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్ లైన్ జర్నలిస్ట్స్ (TUOWJ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. TUOWJ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ నిర్వహణలో ‘ఆన్ లైన్ జర్నలిజం.. భవిష్యత్తు- సవాళ్లు’ అనే అంశంపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో డిజిటల్ మీడియా వేదికగా జర్నలిస్టులు పని చేస్తున్నారని, కొత్త మీడియాను ప్రోత్సాహించాలి గానీ, అణగాదొక్కే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకూడదని పలువురు ప్రముఖులు సీనియర్ జర్నలిస్టులు కోరారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డు ఐపీయస్ అధికారి జె. పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ పాత్రికేయులు మాడభూషి శ్రీధర్, తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షులు పల్లె రవి కుమార్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, tuwj నాయకులు ఇస్మాయిల్, రమణ, సీనియర్ జర్నలిస్టులు విఠల్, ప్రేమ మాలిని, కోనేరు రూపావని , యోగి, భద్ర, స్వామి ముద్దం తదితరులు పాల్గొన్నారు.