చర్లపల్లి ఒపెన్ జైల్లో హైదరాబాద్ రేంజ్ సమీక్ష సమావేశం
ఖైదీలను సత్ప్రవర్తన గల పౌరులుగా మార్చేందుకు తెలంగాణ జైళ్లశాఖ నూతన సంక్షరణలు తీసుకువస్తుందని జైళ్లశాఖ ఐజీ మురళీబాబు తెలిపారు. బుధవారం చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో హైదరాబాద్ రేంజ్ డిఐజీ శ్రీనివాస్ అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఐజీ మురళీబాబు ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మురళీబాబు మాట్లాడుతూ ఖైదీల ఉన్నతికి జైళ్లశాఖ చేపడుతున్న వలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే జైల్లల్లో ఖైదీల ఆత్మహత్యలు తగ్గాయని, జైల్లో పరిశ్రమలు పెట్రోల్ పంపుల ఏర్పాటుతో ఖైదీలకు ఉపాధితో పాటు జైళ్లశాఖకు ఆదాయం పెరిగిందని అన్నారు. జైల్లో ఖైదీలకు సాంకేతికతో పాటు పలు రంగాల్లో ఉపాది శిక్షణ కల్పిస్తున్నమని జైలు నుంచి విడుదల అయిన తరువాత వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. హైదరాబాద్ రేంజ్ పరిదిలోని జైళ్లలో చేపడుతున్న సంస్కరణలను, అభివృద్ధిపై అధికారులు నివేదికలు సమర్పించారు. ఈసందర్భంగా చర్లపల్లి ఓపెన్ జైల్లోని చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈకార్యక్రమంలో చర్లపల్లి ఒపెన్, చర్లపల్లి, చంచల్గూడ సెంట్రల్ మహిళ జైలు పర్యావేక్షణ అధికారులు కళాసాగర్, సంతోష్ కుమార్ రాయి శివ కుమార్ గౌడ్, వెంకట్ లక్ష్మి, సంగారెడ్డి కరీంనగర్ నల్లగొండ మహబూబ్నగర్ జైలు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు