హైదరాబాద్ ప్రాంతానికి చెందిన నర్రా సుఖేంధర్ రెడ్డి, ప్రస్తుతం భారత రక్షా మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరియు నర్రా ఫౌండేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వారు చేసిన సేవలకు గుర్తింపుగా, ఇండో యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మరియు సీఈవో విజయ్ తివారి మరియు సెక్రటరీ జనరల్ లక్ష్మీ ఠాగూర్, నర్రా సుఖేంధర్ రెడ్డిని ఇండియన్ యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్నూర్ తెలంగాణ కో-ఆర్డినేటర్‌గా నియమించారు.
ఈ నియామకంపై నర్రా సుఖేంధర్ రెడ్డి, “గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ నియామకం నాకు ఒక గొప్ప అవకాశం. తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేయడం ద్వారా, తెలంగాణ గ్రామాలలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి మరియు వాటి ఉత్పత్తులకు విదేశీ మార్కెట్‌ను సృష్టించడానికి నేను కృషి చేస్తాను” అని తెలిపారు.
ఇండో యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది భారతదేశం మరియు యూరోప్ మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ. ఇది భారతదేశంలోని 27 గ్రామ పంచాయతీలతో కలిసి పనిచేస్తున్నది, వీటిలో ప్రతి ఒక్కటి ఒక చిన్న లేదా మధ్య తరహా కూటీర పరిశ్రమను స్థాపించడానికి ప్రణాళిక చేస్తోంది.