
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 21,22,23,13వ డివిజన్ లోని యువత పెద్ద ఎత్తున తరలివచ్చి పోచంమైదాన్ నుండి ఎమ్మెల్యే నన్నపునేనికి స్వాగతం పలికి డీజే మొతలతో క్రేన్ తో భారీ గజమాలను ఎమ్మెల్యేను సత్కరించి ర్యాలీ నిర్వహించారు
తదనంతరం దేశాయిపేట లోని కేఆర్ గార్డెన్లో యూత్ నాయకులు దిలీప్ రెడ్డి ఏర్పాటు చేసిన చేరిక కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ బీజేపీ నుండి యూత్ నాయకులు ఆఫ్రోజ్,కమల్,అగ్బర్ తో పాటు సుమారు 150 మంది నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
నియోజకవర్గంలోని యువత అంతా కెసిఆర్ కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తనకు అండగా నిలుస్తున్నారన్నారు
90 శాతం నిరుపేదలు ఉన్న ఈ ప్రాంతంలో తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో జిల్లా కేంద్రం నూతన కలెక్టరేట్ నూతన బస్టాండ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 24 అంతస్తులతో 1250 కోట్లతో దేశంలో ఎక్కడా లేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు చేశామన్నారు ఎప్పుడో 1945లో పోసిన మండిబజార్, చౌరస్తా రోడ్లను తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు
సంక్షేమంలో బాగంగా ఆసరా పెన్షన్ దళిత బంధు రైతుబంధు రైతు బీమా కేసీఆర్ కిట్ ఇలా మరెన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నారన్నారు.
నేడు ఎన్నికలు రాగానే ఎక్కడెక్కడినుండో నాయకులు వస్తారని నేడు ఇక్కడ కాంగ్రెస్ బిజెపి నుండి పోటీ చేసే నాయకులు ఒకరు వర్ధన్నపేట మరొకరు వంచనగిరి కానీ తాను లోకల్ అని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మరణించేవరకు ఉంటానన్నారు
కరోనా ఆపత్కర పరిస్థితుల్లో తానే ప్రజల వెంట ఉన్నానని
వరదలు వచ్చినప్పుడు తానే ఉన్నానని చెప్పారు
ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్ సెంటర్ తానే ఏర్పాటు చేశానని
మొన్న జరిగిన బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఎన్నికల కోడ్ వల్ల ఏర్పాట్లకు ఇబ్బందులు కలిగితే తన తండ్రి ఎన్ఎన్ ట్రస్ట్ ద్వారా వారికి సహాయం చేయడం జరిగిందన్నారు
తాను పడ్డ కష్టం ఎవరూ పడవద్దని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కంపెనీలో ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు ఎన్నికల తర్వాత ఇక్కడ కంపెనీలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు
డేవేలెప్మెంట్ అంటే బిఆర్ఎస్,డేవేలెప్మెంట్ అంటే కేసీఆర్,డేవేలెప్మెంట్ అంటే నన్నపునేని నరేందర్ అని అన్నారు దేశాయిపేటలో రోడ్లన్నీ గొప్పగా మార్చామని నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే చాలా అంతర్గత సిసి రోడ్లు పూర్తయ్యాయని మరి కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో 55సంవత్సరాలు 11సార్లు కాంగ్రెస్ పరిపాలించింది ఎక్కడ అభివృద్ధి చేయలేదు
మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలకులు అజంజాహి మిల్స్ అమ్ముకుంటే కేసీఆర్ సంగం లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాది అవకాశం కల్పిస్తున్నామన్నారు
మట్టికైనా మనోడే కావాలంటారు కాబట్టి
నేను మీ ఇంటోన్ని మీ ఆపతి సంపతిలో తోడుంటా యువత భవిష్యత్తు కోసం కారుకు ఓటేయ్యాలి గంగ జమున తహజీబ్ లాగా కలిసి ఉండే మనలో గొడవలు పెట్టేందుకు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తనని తనని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ఇంచార్జ్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి,యేలుగం లీలావతి సత్యనారాయణ,కార్పొరేటర్ సురేష్ జోషి, డివిజన్ల అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జిలు ముఖ్య నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు