
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
భద్రకాళి అమ్మవారి దయతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలో ఆశీ స్సులతో ఈ రోజు నేను పార్టీ బి-ఫారం తీసుకోబోతున్నాను. గత 37 సంవత్సరాలుగా నిస్వార్ధంగా పార్టీకి సేవ చేస్తూ వచ్చాను. అందుకే నా కష్టాన్ని అర్ధం చేసుకొని ప్రజలకు సేవ చేసందుకు అవకాశం దక్కినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గత 30 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు నాపై ఎన్ని కేసులు పెట్టిన నేను ఎప్పుడు భయపడ లేదు. నాకు ధైర్యం ఇచ్చి నాకు తోడు ఉంది నాకు సహకరించినందుకు నేను ఎప్పుడు మీకు రుణ పడి ఉంటాను అని అన్నారు.
ఎక్కడ నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ వస్తదో అని ప్రతిపక్ష పార్టీలకు భయం పట్టుకుక్నది. అందుకే నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నాపై అసత్య ప్రచారం చేస్తూ వచ్చారు. నాపై ఉన్న ఆరోపణలు నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంట అని నిన్న పత్రికా విలేఖరుల సమావేశంలో నేను విసిరిన సవాలుకు ఎందుకు స్వీకరించలేదు ? ఇంతవరకు స్పందించలేదు అంటేనే అర్థమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, సమద్, మాడిశెట్టి రాజ్ కుమార్, జి. శివ ప్రసాద్, సీనియర్ నాయకులు నాయిని లక్ష్మ్యా రెడ్డి, మీర్జా అజీజుల్లా బేగ్, గుంటి స్వప్న తాళ్లపల్లి మేరీ, సాయి రామ్ యాదవ్, కొండా నాగరాజు, సత్తు రమేష్, వల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు