
ఉప్పల్ నియోజకవర్గం, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అధ్యక్షతన నాచారం బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో, బి.ఆర్.ఎస్. పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి, నాచారం డివిజన్ ముఖ్యనాయకులు, డివిజన్ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలతో కూడిన ఆత్మీయ సమ్మేళనం సభను నిర్వహించడం జరిగింది.ఈ సభకు మాజీ ఎంబీసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఉప్పల్ నియోజకవర్గ పలువురు డివిజన్ కార్పొరేటర్లు, పలువురు ముఖ్యనాయకులు, పలువురు డివిజన్ అధ్యక్షులు, పలువురు బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ…బండారి లక్ష్మారెడ్డి ని ఆదర్శంగా తీసుకొని 2010 నుండి ఆయన అడుగులో అడుగై నడుస్తున్న.. ఉప్పల్ నియోజకవర్గానికి 100పడకల ఆసుపత్రిని తీసుకొచ్చిన పెద్దలు బండారి లక్ష్మారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు బండారి లాక్ష్మా రెడ్డి నిజాయితీ కలిగిన నాయకుడు మాట ఇస్తే తప్పడు.. మడమ తిప్పడు.. ఎంత జఠిలమైన సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించే శక్తి ఉన్న వ్యక్తి.. ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కరించే దమ్మున్న నాయకుడు.. పేద ప్రజలకోసం ఎంతైనా దానం చేసే కలియుగ కర్ణుడు మా లక్ష్మారెడ్డి అన్న ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని గుర్తుపట్టి పేరుతో పిలుస్తారు గతంలో ఎమ్మెల్యే ని కలవాలంటే కలవలేని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు బండారి లక్ష్మారెడ్డి ని నేరుగా మనమే కలిసి మన సమస్యకు పరిష్కారం పొందొచ్చు ఎమ్మెల్యే కాకముందే, ప్రచారం చెయ్యకుండానే 100పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన దిల్ దార్ మనిషి మా లక్ష్మారెడ్డి అన్ననిస్వార్థంగా పేద ప్రజలకోసం బి.ఎల్.ఆర్ ట్రస్ట్ ద్వారా వేల మందికి ఆర్దికంగా సహాయం చేస్తూ…పేద ప్రజల పక్షాన నిలిచిన నాయకుడే మన ఉప్పల్ నుండి ప్రాతినిధ్యం వహించడం మనందరి ఆదృష్టం..ఇంత నిజాయితీగా పేదల కష్టాలు తీర్చే నాయకుడిని మనందరం అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉప్పల్ నియోజకవర్గాన్ని తెలంగాణ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని తీర్మానం చేశారు.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మేల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే ఆవకాశం ఇచ్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు.నాకు టికెట్ వచ్చి దాదాపు నెలన్నర అయ్యింది 20 రోజుల క్రితమే ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ఇండస్త్రీయల్ భూముల్ని కేటీఆర్ సహకారంతో రెసిడెన్షియల్ జోన్ లోకి తీసుకువచ్చాను గత 3నెలలుగా కేసీఆర్ కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ 100 పడకల ఆసుపత్రిని నిన్ననే మంజూరు చేపించాను. కొన్ని రోజుల్లోనే కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలతో కూడిన అధునాతన హాస్పిటల్ అందుబాటులోకి రానుంది.ఉప్పల్ నియోజకవర్గానికి ఒక జూనియర్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాను ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాను ఎర్రకుంట చెరువును మోడరన్ లేక్ గా మార్చి అందరూ వాకింగ్ చేసే విధంగా వాకింగ్ ట్రాక్ వేపిస్తాను. నాచారంలో దోమలు బెడద లేకుండా చేస్తాను ఉప్పల్ నియోజకవర్గానికి పలుచోట్ల ఓపన్ జిమ్స్ ఏర్పాటు చేస్తాను ఉప్పల్ లో ఎవరైనా పేద విద్యార్థులు ఎంబీబీఎస్ సిటు సాధించి వారు ఫీజ్ కట్టలేని పరిస్థితిలో ఉంటే నాకు చెప్పండి నేను వారికి సహాయం చేస్తాను. ఉప్పల్ నియోజకవర్గంలో మీ అందరికీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా నన్నే కలవండి. ఉప్పల్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యాలనే దృక్పథంతో నేను మీ ముందుకు వచ్చాను. మీరు నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తే, వచ్చే 5యేండ్లు మీకు ఇంటిమనిషిలా పనిచేసి మీ ఋణం తీర్చుకుంటానన్నారు..
ఈ సందర్బంగా మాజీ ఎం.బి.సి. చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…
బండారి లక్ష్మారెడ్డి ఆత్మీయ సమ్మేళన సభను భారీ సక్సెస్ చేసిన బియారెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఉప్పల్ లో మన బ్రతుకు చిత్రాన్ని మార్చే సత్తా ఉన్న ఏకైక నాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి మనం రెండు నెలలు తనకోసం కష్టపడితే చాలు.. మనకోసం వచ్చే 5 యేండ్లు నిరంతరం సేవ చేసే నాయకుడు బండారి లక్ష్మారెడ్డి కేసీఆర్ రు చేపించిన సర్వే లో ఉప్పల్ ప్రజల ఆషాకిరణం బండారి లక్ష్మారెడ్డి అని తేటతెల్లం అవ్వడంతో పిలిచి మరీ టికెట్ ఇచ్చారు..ఇంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడితో కలిసి పనిచేయ్యాలని నిత్యం అనుకునే వాడిని, ఇప్పుడు కలిసి పనిచెసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. కొందరి నాయకుల్లాగా మాటలు చెప్పడు.. నిజాయితీగా నిబద్దతతో పనులు చేసి చూపిస్తాడు.. ఇలాంటి నిబద్దత కలిగిన నాయకుడికి మనందరం అండగా నిలబడాలి, భారీ మెజారిటీతో గెలిపించుకుని మన భవిష్యత్ ని మనమే రాసుకోవాలి. ఈ సందర్భంగా మీర్ పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య మాట్లాడుతూ.. భరోసా అంటే బండారి… లక్ష్మారెడ్డి అంటే బాధ్యత…మనం ఏం కావాలో అడగకుండానే అన్ని చేస్తుండు బండారి లక్ష్మారెడ్డి లచ్చన్న రావడం రావడంతోనే 100పడకల ఆసుపత్రి తీసుకొచ్చాడు.. ఇలా ఇంతవరకు ఏ నాయకుడు చెయ్యలేదు, చెయ్యలేరు..మనకు తిండి పెట్టె నాయకుడు, మనకు ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి పరిష్కరించే గొప్ప వ్యక్తి బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కై అధిష్టానం పంపినటువంటి దూత బండారి లక్ష్మారెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ నిర్ణయమే మాకు ఫైనల్.. బండారి లక్ష్మారెడ్డి మన ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి నీ ఆదర్శంగా తీసుకొని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ దంపతులు నిత్యం కష్టపడుతూ నాచారం డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు..ఇలాంటి గొప్ప నాయకుడిని ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి పెద్దఎత్తున ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు..