
కుషాయిగూడ మార్కెట్ లో ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మార్కెట్ లో ఇటు కొనుగోళ్లదారులతో పాటు అమ్మకందారుల కష్టాలు, బాధలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అక్కడున్న ఇబ్బందులను విన్న పరమేశ్వర్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుషాయిగూడ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా కార్పోరేటర్ స్థాయిలో డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు.
సామాన్యుడి స్వరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని… మీకు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని విజ్ఞప్తి చేశారు.