మరిన్ని విజయాలు సాధించాలి రాచకొండ పోలిస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ బహుమతి ప్రదానోత్సవం రోజు అభినందన
రాచకొండ పోలీస్ కమీషనరేట్ లో అకౌంట్స్ బ్రాంచ్ లో అసిస్టెంట్ అకౌంట్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పీ.ప్రదీప్ కుమార్ ని జితేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరి హోమ్ డిపార్ట్మెంట్ , తెలంగాణ రాష్ట్రం, రాచకొండ సీపీ జీ. సుధీర్ బాబు ఐ.పీ.ఎస్., స్పోర్ట్స్ మీట్ -2024 లో సన్మానించారు.
ప్రదీప్ గత సంవత్సరం నవంబర్ నెలలో 18 తారీఖున కిర్గిజిస్తాన్ దెశంలోని బిష్కెక్ నగరంలో జరిగిన ప్రపంచ స్థాయి పవర్ లిఫ్టింగ్ (ఓపెన్ వరల్డ్ కప్ – 2023) పోటీలలో భారతదేశం తరపున పాల్గొని మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలిస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ -2024 నందు చీఫ్ గెస్ట్ గా హాజరైన జితేందర్ రెడ్డి మరియు జీ. సుధీర్ బాబు ఐ.పీ.ఎస్., కమిషనర్ అఫ్ పోలిస్ రాచకొండ, ప్రదీప్ కుమార్ ని సన్మానించి అభినందించటం జరిగింది మరియు భవిష్యత్తులో మరన్ని విజయాలు సాధించి దేశానికి మరియు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాలని అకాంక్షించారు