రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్
ఎన్నికల కోడ్ నేపథ్యంలో భూముల క్రయవిక్రయాల ద్వారా వచ్చిన డబ్బులు పోలీసులు తనిఖీ సమయంలో పట్టుబడితే సరైన పత్రాలు చూపించిన వారి డబ్బులు సీజ్ చేయకుండా వదిలేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అవసరాల నిమిత్తం, వివాహాల కోసం, బంగారు నగల కొనుగోలు కోసం ప్రజలు చిన్నచిన్న ప్లాట్లను అమ్ముకుంటున్నారని తెలిపారు. సరైన పత్రాలు చూపించిన వారికి పోలీసులు డబ్బులు స్వాధీనపరచుకొని ఇబ్బందులకు గురి చేయకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేయాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాన్ని జీవనభృతిగా ఎంచుకొని పనిచేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారిని పోలీసులు గుర్తించి వదిలేయాలని కోరారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా కోశాధికారి పాల సైదులు , నాయకులు బానోత్ జానీ నాయక్, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, అయిత గాని మల్లయ్య గౌడ్, రేస్ నాగయ్య గౌడ్ తదితరులు ఉన్నారు