నంద్యాల ప్రకాశం పార్క్ ఆత్మకూరు బస్టాండ్ వద్ద, అర్బన్ హెల్త్ సెంటర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ… నంద్యాలలో దాదాపు చాలామందికి గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయని రోగికి తెలియకుండానే తిరుగుతున్నారని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు తిరిగి అనేక వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సరైన వైద్యం అందించడం ద్వార ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు*, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ , కో ఆప్షన్ మెంబర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం , 3వ వార్డు కౌన్సిలర్ సమద్ , 3వ వార్డు Ysrcp నాయకులు అన్వర్ బాషా , వైద్యాధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.