గత నెల జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
సిరత్ క్విజ్ 23 పరీక్ష ఫలితాల బహుమతులు ఈరోజు జమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంబి జమాన్ అధ్యక్షతన,
ముఖ్య అతిథి , ఎమ్మెల్సీ సి. ఈసాక్ బాషా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది .
ఇందులో మొదటి బహుమతి 10,000 రూపాయలు నంద్యాల ముల్లాంపేట బాలికల ఉర్దూ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని, షేక్ షకీరా కు దక్కింది .
రెండవ బహుమతి , 5000 రూపాయలు టెక్కే మున్సిపల్ హై స్కూల్ కు చెందిన విద్యార్థి షేక్ మహబూబ్ బాషా కి మరియు మూడవ బహుమతి 3000 రూపాయలు అభ్యుదయ విద్య నికేతన్ కు చెందిన విద్యార్థి షేక్ రేష్మ అనే విద్యార్థినికి దక్కింది. వీటితోపాటు 17 కన్సోలేషన్ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జమాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుండి నిరంతరంగా నిర్వహిస్తున్న , సీరత్ క్విజ్ లాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని అభినందించారు .
దీనివలన మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం జీవిత చరిత్ర మరియొక మహోన్నత నడవడికను విద్యార్థులు అవలుబించు కొని సమాజానికి మంచి పౌరులుగా తయారవుతారని అన్నారు. సీరత్ క్విజ్ మరియు జమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని వారు అన్నారు. ఈ సీరత్ క్విజ్ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధిపరిచి ఇంకా ఎక్కువమంది విద్యార్థులకు పాల్గొనేలా చేసి ఒక యజ్ఞం లాగా దూసుకుపోవాలని అన్నారు.
నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిస మాట్లాడుతూ మహా ప్రవక్త జీవితం అందరికీ ఆదర్శమని అందరూ కులాలకు మతాలకు అతీతంగా వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటే సుఖశాంతులతో జీవితం సాఫల్యం అవుతుందని అన్నారు. కన్వీనర్ నవభారత్ హుస్సేన్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించిన ఈ కార్యక్రమం వక్తలు ఆల్మేవ అబులైజ్,
ముస్లిం జేఏసీ అతావుల్లా ఖాన్, సీనియర్ న్యాయవాది మదిని తోపాటు కో ఆప్షన్ సభ్యులు సలాముల , కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, వైసీపీ నాయకులు నిజాంఖాన్ మరియు ప్రముఖ బిల్డర్ అబ్దుల్లా ప్రసంగాలతో నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ ఖాజా హుస్సేన్ ఉపాధ్యాయులు, పాల్గొన్నారు