వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండవసారి గులాబీ జెండా ఎగిరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఈ సందర్భంగా బిఆర్ఎస్ యూత్ నాయకులు సింగరి రాజకుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యూత్ నాయకులు సుమారు 30మంది ఏఎస్ఎం కళాశాల వద్దనున్న ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే నరేందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
పార్టీలో చేరిన వారందరికీ కాపాడుకుంటానని అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో అభివృద్ధిలో తూర్పు నియోజకవర్గాన్ని ముందు ఉంచామని కారు గుర్తుపై ఓటు వేసి మరో మారు తనని గెలిపించి తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు.
పార్టీలో చేరిన వారిలో అల్లం మస్తాన్,సిరిగిరి సాయి,సిరిగిరి సమ్మయ్య,పిస్తం రాజు,పిస్తం శివ, అల్లం తిరుపతి,బండి వెంకటేష్,అఖిల్, తిల్కలపల్లి సాంబశివ, పగిడి పాటి సందీప్, రాంపల్లి వేణుగోపాల్,అజ్జురి శివ సాయి,సాకుల పరమేష్ తదితరులు పార్టీలో చేరారు.